మరో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసిన రామ్ పోతినేని.!

మరో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసిన రామ్ పోతినేని.!

Published on Oct 17, 2021 2:00 PM IST

RAPO 1

ఇస్మార్ట్ శంకర్ తో మాస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దాని తర్వాత మరిన్ని మాస్ సబ్జెక్టులు ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఇదే లైనప్ లో మాస్ సినిమాల స్పెషలిస్ట్ లింగు సామి కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యగా దానిపై మంచి క్రేజ్ కూడా నెలకొంది.

అయితే గత కొంత కాలమే స్టార్ట్ అయ్యిన ఈ చిత్రం ఇప్పుడు దాని రెండో కీలక షెడ్యూల్ ని విజయవంతంగా కంప్లీట్ చేసినట్టుగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. మొత్తం ఈ షెడ్యూల్ లో పాల్గొన్న క్రూ అంతా కలిపి ఒక ఫొటోతో నిర్మాణ సంస్థ తెలిపారు.

అయితే ఈ షెడ్యూల్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు