కొత్త సంవత్సరాన్ని ప్రేమతో మొదలు పెట్టనున్న రామ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లోని 22వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.

నూతన సంవత్సరం కానుకగా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘ప్రేమతో.. ఈ కొత్త సంవత్సరం’’ అంటూ వారు ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరోయిన్ చున్నీతో హీరో తన తల తుడుచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 1న ఉదయం 10.35 గంటలకు ఈ ట్రీట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాలో రామ్ పోతినేని సాగర్ అనే పాత్రలో సరికొత్త లుక్స్‌తో కనిపించనున్నాడు. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న ట్రీట్ ఏమై ఉంటుందా అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version