టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సీక్వెల్ చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ సాలిడ్ క్రేజ్‌ను క్రియేట్ చేస్తుంది. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ చిత్రానికి ఈ మూవీ సీక్వెల్‌గా వస్తుండటంతో ప్రేక్షకులలో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలను పెంచాయి.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా యమ యాక్టివ్‌గా జరుగుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ చిత్రానికి 50 వేలకు పైగా ఇంట్రెస్ట్‌లు రావడంతో పాటు ట్రెండింగ్ అవడమే దీనికి నిదర్శనమని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. మార్చి 28న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.