రేర్ ఫోటో: ఒకే ఫ్రేమ్ లో అలనాటి అందగాళ్ళతో దాసరి

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నన్ని నాళ్ళు తప్పకుండా గుర్తుండిపోయే దిగ్గజ తారలు కొందరు ఉన్నారు. మరి అలాంటి వారిలో తమ చిత్రాలతో తెలుగు సినిమాతో సేవలందించిన అలనాటి హీరోలు సూపర్ స్టార్ కృష్ణ అలాగే శోభన్ బాబులు కూడా ఉంటారు.

మరి ఇప్పుడు అంటే కొందరు హీరోలుకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం మాట్లాడుకుంటాం కానీ అప్పట్లో అయితే ఈ హ్యాండ్సమ్ హీరోలే అప్పటి తరం ఆడవారికి డ్రీం హీరోలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ఇద్దరు హీరోలపై ఓ రేర్ పిక్ ఇపుడు బయటికి వచ్చింది.

వారిద్దరి కలయికలో వచ్చిన కృష్ణార్జునులు అనే సినిమా ఆరంభ కార్యక్రమంలో దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు కలిపి ఉన్న పిక్ మళ్ళీ పాత రోజులు గుర్తు చేసింది. దీనితో ఇలా ఈ దివంగత నటులు దర్శకుల మధురానుభూతి వైరల్ గా మారింది.

Exit mobile version