రవితేజతో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ ?

రవితేజతో రాశి ఖన్నా స్పెషల్ సాంగ్ ?

Published on Jul 7, 2020 3:00 AM IST


రవితేజ ‘క్రాక్’ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అట. అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట, ఈ సాంగ్ కోసం రాశి ఖన్నాను అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా హీరోయిన్స్ గా ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలనుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కాగా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని కరోనా తగ్గాక విడుదల చేయాలనుకుంటున్నారు. ఏమైనా రవితేజ ‘డిస్కో రాజా’తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు