రష్మీకి బహుమతిగా తాపేశ్వరం కాజా.

Published on Jun 6, 2020 7:01 pm IST


జబర్ధస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమెకు అందిన అరుదైన స్వీట్ ఫోటోతో పాటు ఫన్నీ సందేశం పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో ఓ షోరూమ్‌ ప్రారంభానికి రష్మిని ఆహ్వానించారు. ఆ షో రూమ్ నిర్వాహకులు రష్మికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు .

తాపేశ్వరం ఖాజాని రష్మికి బహుమతిగా ఇచ్చారు. ఈ స్వీట్‌ ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే. దీన్ని తిందామని నోరు తెరిస్తే రష్మి వల్ల కావట్లేదు. ఎందుకంటే అది రష్మి ముఖం కంటే పెద్దగా ఉంది. ఇంత పెద్ద తాపేశ్వరం ఖాజాని ఇచ్చినందుకు షోరూం యజమానులకు థ్యాంక్స్‌ చెబుతూ ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఖాతాలో అప్‌లోడ్‌ చేసింది. ‘ఈ ఖాజా చూడ్డానికి చాలా బాగుంది. కాకపోతే నా ముఖం కంటే పెద్దగా ఉంది. దీన్ని ఎంతమంది తింటే అయిపోతుందో’.. అని క్యూట్‌ క్యూట్‌గా చెప్పిన మాటలు అందరినీ తెగ నవ్విస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More