ఇటీవల కేరళ లోని ఒక దారుణమైన విషాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వయనాడ్ అనే ప్రాంతంలో భారీ వర్షాలు కారణంగా కొండా చరియలు విరిగిపడి రాత్రికి రాత్రే కింద ఉన్న ఊరు మొత్తం నేలమట్టం అయిపోయింది. ఎన్నో వేల ప్రాణాలు నిద్దుర లోనే కన్ను మూసాయి. దీనితో ఈ ఘోర ఘటన తీవ్ర విషాదంగా మారగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.
అలాగే చాలా మంది సినీ ప్రముఖులు కేరళ ప్రభుత్వం సంక్షేమ నిధికి విరాళాలు కూడా అందిస్తుండగా తాజాగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా ఇందులో భాగం అయ్యింది. తన వంతుగా కేరళ ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఆమె అందించి తన ఉన్నత మనసు చాటుకుంది. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో భారీ సీక్వెల్ చిత్రం పుష్ప 2 చేస్తుండగా ఈ సినిమా మాత్రమే కాకుండా తమిళ్ సహా హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో రష్మికా మందన్నా నటిస్తూ బిజీగా ఉంది.