మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్న సాలీడ్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “ఫ్యామిలీ స్టార్”. మరి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా మేకర్స్ వచ్చే ఏడాది రిలీజ్ కి ఆల్రెడీ లాక్ చేశారు. అయితే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక కీ రోల్ లో నటిస్తుంది.
మృణాల్ ఠాకూర్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేయగా, అదే లొకేషన్ కి సంబందించిన మరొక పోస్ట్ ను హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేయడం జరిగింది షూటింగ్ ఫర్ సంథింగ్ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో తను కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ప్రస్తుతానికి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో సినిమాని ఫిక్స్ చేసారు. మరి ఇది వాయిదా పడొచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. దీనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.