“పుష్ప ది రైజ్” పై శ్రీవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

“పుష్ప ది రైజ్” పై శ్రీవల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Oct 9, 2021 7:19 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ చాలా హై స్యాండర్డ్స్ తో చాలా నాచురల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన రష్మికా లుక్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ఈ సినిమాలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రష్మికా “పుష్ప ది రైజ్” పై లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో తన రోల్ చాలా కొత్తగా ఉంటుందట అంతే కాకుండా తన నటనకు చాలా స్కోప్ ఉన్నందున ఈ సినిమా తన కెరీర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని రష్మికా అనుకుంటుందట.

అంతేకాకుండా ఇది తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం తన ఫస్ట్ రిలీజ్ టైం లో కూడా చాలా టెన్షన్ కి గురయ్యినట్టుగా తెలిపింది. అయితే తాను చేస్తున్న శ్రీవల్లి పాత్రకి ముందు నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ ఉంది. అలాగే ఇప్పుడు రాబోతున్న శ్రీవల్లి స్పెషల్ సాంగ్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాని కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వీటన్నింటినీ బట్టి పుష్ప లో రష్మికా ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చెయ్యడం గ్యారంటీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు