భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న ర‌ష్మిక‌..?


నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న ‘పుష్ప’ చిత్రంతో దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో అంద‌రికీ తెలిసిందే. అందం, అభిన‌యంతో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ, వ‌రుస‌గా సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అలరిస్తోంది. కేవ‌లం సౌత్ లోనే కాకుండా ‘యానిమ‌ల్’ మూవీతో నార్త్ లోనూ సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు త‌న అభిమానుల‌ను భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ట ఈ బ్యూటీ. బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి ఓ హార్ర‌ర్ కామెడీ మూవీలో న‌టించేందుకు ర‌ష్మిక రెడీ అవుతోంద‌ట‌. ఈ సినిమాను ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ వంటి హార్ర‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన నిర్మాత దినేష్ విజ‌న్ ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ఆదిత్య స‌త్పోద‌ర్ క‌థను రెడీ చేయ‌గా, ఈ ప్రాజెక్ట్ కోసం ర‌ష్మిక‌ను ఓకే చేశార‌ట మేక‌ర్స్.

ఆయుష్మాన్ ఖురానాతో తొలిసారి జ‌త‌కడుతున్న ర‌ష్మిక, మునుపెన్న‌డూ చూడ‌ని పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ‘వాంపైర్స్ ఆఫ్ విజ‌య్ న‌గ‌ర్’ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేస్తార‌ట.

Exit mobile version