ఇక్కడ తప్పించుకున్న రష్మిక అక్కడ బుక్ అయ్యింది!

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఎలాంటి ఫామ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు.. స్టార్ హీరోల సరసన ఆఫర్లతో ఈ బ్యూటీ ఏ హీరోయిన్ పోటీ పడలేనంతగా దూసుకుపోతుంది. పుష్ప-2 గ్రాండ్ సక్సెస్, ఛావా సెన్సేషన్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ నేషనల్ స్థాయిలో తన సత్తా చాటుకుంది ఈ బ్యూటీ. అయితే, ఇప్పుడు మాత్రం రష్మికకు బ్యాడ్ టైమ్ ఎదురైందని చెప్పాలి.

టాలీవుడ్‌లో తప్పించుకున్న రష్మిక బాలీవుడ్ దగ్గర బుక్ అయ్యింది. హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి యావరేజ్ రిజల్ట్‌ను రాబడుతోంది. ఇక ఈ సినిమాలో తొలుత రష్మిక హీరోయిన్‌గా ఓకే చెప్పింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ శ్రీలీలకు వెళ్లింది. ఈ సినిమాలో ఆమె పాత్రపై సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ వస్తుంది. దీంతో రష్మిక ఈ సినిమా చేయకపోవడం చాలా మంచిదయ్యిందని అందరూ అనుకున్నారు.

కానీ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ‘సికందర్’ సినిమాలో నటించిన రష్మిక, అక్కడ మాత్రం ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన సికందర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమాలో నటించినందుకు రష్మిక బుక్ అయ్యిందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సౌత్‌లో ఫ్లాప్ తప్పించుకున్న ఈ బ్యూటీ, నార్త్‌లో తప్పించుకోలేకపోయింది.

Exit mobile version