అందం కోసం అవన్నీ వదిలేసిన రష్మిక.

Published on Aug 4, 2020 9:53 pm IST


టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో రష్మిక పేరు వచ్చి చేరింది. ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ తో రష్మిక చేసిన సరిలేరు నీకెవ్వరు భారీ విజయం అందుకుంది. ఇక నితిన్ తో చేసిన భీష్మ మూవీ సైతం మంచి హిట్ దక్కించుకుంది. కాగా సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మూవీతో ఆమె పాన్ ఇండియా ఎంట్రీ కూడా ఇవ్వనుంది. కాగా ఈ బ్యూటీ చర్మ సౌందర్యం గురించి కొన్ని టిప్స్ చెప్పింది.

అలాగే ఆమె అందంగా ఉండడానికి కూడా కారణాలు చెప్పింది. గతంలో ఆమె చర్మం అంత అందంగా ఉండేది కాదట. దీనితో పరీక్షలు చేయగా, ఆమెకు స్కిన్ ఎలర్జీ ఉందని తెలిసిందట. దీనితో రష్మిక ఆ ఎలర్జీకి ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు, ఆహార అలవాట్లను మార్చుకున్నారట. స్కిన్ ఎలర్జీకి కారణమైన అన్నిరకాల ఫుడ్స్ దూరం పెట్టిందట. అప్పటి నుండి తన చర్మం నిగనిగలాడుతోంది అని రష్మిక చెప్పుకొచ్చింది. అలాగే మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అలవాట్లు మార్చుకోవాలని చెవుతుంది.

సంబంధిత సమాచారం :

More