రవితేజ ‘రావణాసుర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిటైల్స్

రవితేజ ‘రావణాసుర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిటైల్స్

Published on Mar 31, 2023 12:18 AM IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ రావణాసుర. ఈ మూవీలో సుశాంత్ అక్కినేని కీలక పాత్ర చేస్తుండగా దీనిని యువ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన రావణాసుర మూవీలో పూజితా పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, దక్షా నాగర్కర్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక మరోవైపు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ రవితేజ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు పెంచేసాయి. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏప్రిల్ 1న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్ 7న భారీగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు