ఇంటర్వ్యూ : నిర్మాత అభిషేక్ నామా – “రావణాసుర”లో రవితేజ గారిని చూసి షాక్ అవుతారు

ఇంటర్వ్యూ : నిర్మాత అభిషేక్ నామా – “రావణాసుర”లో రవితేజ గారిని చూసి షాక్ అవుతారు

Published on Apr 5, 2023 5:56 PM IST

ఈ వారం థియేటర్స్ లోకి రిలీజ్ కి రాబోతున్న మరో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” కూడా ఒకటి. మరి మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాని మాస్ మహారాజ్ తో కలిసి ఏస్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ నిర్మాణం వహించారు. మరి ఈ సినిమాపై పలు విశేషాలు అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తాను తెలియజేసారు. మరి అవేంటో చూద్దాం రండి.

“రావణాసుర”కి కర్త కర్మ క్రియ మీరే అని అందరూ చెబుతున్నారు ?

లేదండీ. అంతా హీరో రవితేజ గారిది. ఆయనే కథని ఫైనల్ చేసి నన్ను పిలిచి సినిమా చేయమని చెప్పారు. రవితేజ గారు కూడా ఇందులో ఒక నిర్మాత.

 

డైరెక్టర్ కథ చెప్తున్నప్పుడు మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన అంశం ఏంటి?

ఇంతవరకూ రవితేజ గారు ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ గారు ఇలా కూడా చేయగలుగుతారా ? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ . ఇది వర్క్ అవుట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు.

 

ఇప్పటి వరకూ ‘రావణాసుర’ కథ గురించి టీం లో ఎవరూ లీడ్ ఇవ్వలేదు. మీరు ఏం చెబుతారు ?

థ్రిల్లర్ జోనర్స్ చూసినప్పుడు షాకింగ్.. వావ్.. ఫ్యాక్టర్స్ వుంటాయి. అవి ముందే ఆడియన్స్ కి తెలిసిపోయినపుడు ఆ కిక్కు రాదు. అందుకే కథ గురించి బయటికి చెప్పలేదు.

 

భారీ తారాగణం కనిపిస్తోంది.. మీరు అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేశారా ?

అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేశాం. సుధీర్ వర్మ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ కి పూర్తి చేశారు.

 

రవితేజ గారికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ?

ప్రేక్షకులు థ్రిల్ అయిపోయి షాక్ లో వుంటారు. రవితేజ గారిని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయింది కదా అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ ఎక్స్ టార్డినరీగా వుంటుంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

 

సుశాంత్ పాత్ర గురించి చెప్పండి?

ఒక ఇన్నోసెంట్ ఫేస్ తో ఫ్రెష్ గా ఉండాలని సుశాంత్ ని అనుకున్నాం. ఇందులో సుశాంత్ ని చాలా కొత్తగా చూస్తారు.

 

ఈ సినిమా టైటిల్, డిజైన్స్ మీవే అని రవితేజ గారు చెప్పారు?

నేను ఫైన్ ఆర్ట్స్ నేపధ్యం నుంచి వచ్చాను. మంచి సినిమాలు చేయాలనే ఆసక్తి వుంటుంది. కాన్సెప్ట్ సినిమాలు చేయడం ఇష్టం.

 

మీ బ్యానర్ లో సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంటాయి కదా.. రావణాసుర ఎందుకు చేయలేదు ?

ఇక్కడ విడుదలైన తర్వాత ఇదే సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ప్లాన్ చేయాలనే ఆలోచన వుంది.

 

ఇది వరకే సుధీర్ తో “కేశవ” చేశారు దాని ఫలితం మీకు సంతోషాన్నిచ్చిందా?

నిర్మాతగా నాకు ‘కేశవ’ కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. అయితే బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది. రావణాసురతో బ్లాక్ బస్టర్ వంద శాతం కొడతాం.

 

రావణాసుర మ్యూజిక్ కోసం చెప్పండి

హర్షవర్ధన్ రామేశ్వర్ కుటుంబం అంతా సంగీతకారులు. తనకి చాలా ప్రతిభ వుంది. మొదట ‘సాక్ష్యం’ సినిమా ఇచ్చాను. తర్వాత రవితేజ గారికి చెప్పాను. రావణాసురతో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు.

 

రావణాసుర కి సీక్వెల్ వుంటుందా ?

ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తే సీక్వెల్ చేస్తాం. రావణాసుర కథకి ఆ అవకాశం వుంది.

 

రవితేజ గారు 100కోట్ల మార్క్ ని అందుకున్న తర్వాత వస్తున్న రావణాసుర పై మీకు ఎలాంటి అంచనాలు వున్నాయి ?

రవితేజ గారు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. నేనేం ఫీలౌతానంటే.. ఒక ఆర్టిస్ట్ కొత్తగా చేసిన పాత్రని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తే..దానికి మించిన సక్సెస్ ఏమీ వుండదు. కాంతార లాంటి సినిమా చూసినపుడు మనం వావ్ అంటాం. అయితే ఇక్కడ చేయాలంటే మాత్రం వర్క్ అవుట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాం. కానీ రావణాసురతో రవితేజ అవన్నీ బ్రేక్ చేసేశారు.

 

రావణాసుర రచయిత శ్రీకాంత్ విస్సా ని దర్శకుడుగా లాంచ్ చేసే అవకాశం ఉందా?

దర్శకుడిగా నా బ్యానర్ లోనే మొదటి సినిమా చేయాలని చెప్పాను. చేస్తానని కూడా అన్నారు.

 

కళ్యాణ్ రామ్ గారితో “డెవిల్” ఎప్పుడు?

డెవిల్ క్లైమాక్స్ నడుస్తుంది. రెండు మూడు నెలల్లో ఏదైనా మంచి డేట్ చూసి విడుదల చేస్తాం. డెవిల్ 2 కూడా వుంది.

 

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

ప్రేమ విమానం సినిమా నెక్స్ట్ నెలలో రిలీజ్ కి ఉంది,అలాగే 2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు