సీరియల్ నటీనటులు బుల్లితెరకే పరిమితమవుతూ ఉంటారు. సినిమాల్లోకి రావాలని ఆశ ఉన్నా… సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయో ?, రావో అని బుల్లితెరను వదిలిపెట్టరు. ఐతే, బుల్లితెర నటుడు రవికృష్ణ మాత్రం సినిమాల్లోకి వచ్చేందుకు బుల్లితెరకి దూరం జరిగాడు. విరూపాక్ష చిత్రంలో భైరవ్ / కుమార్ పాత్రలో నటించిన రవికృష్ణకు బాగానే గుర్తింపు దక్కింది. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవి కృష్ణ తన జర్నీ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇంతకీ, రవికృష్ణ ఏం మాట్లాడాడో అతని మాటల్లోనే విందాం. రవికృష్ణ మాట్లాడుతూ.. ‘డిగ్రీ అయిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి వచ్చేయాలని ఏం తెలుసుకోకుండానే చెన్నై వెళ్లిపోయాను. తెచ్చుకున్న రూ.5 వేలు కొన్ని రోజులకే అయిపోయాయి. ఆ తర్వాత ఎన్నో బాధలు అనుభవించాను. కొన్ని రోజులు ఫుడ్ లేక, ఉండేందుకు ప్లేస్ కూడా లేక చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు బాగా గుర్తు. నా జేబులో ఓ రెండు రూపాయాల కాయిన్ ఉంటే ఒక నిమ్మకాయ కొనుక్కొని.. బోరు పంపు వాటర్‌లో దాన్ని కలుపుకొని తాగాల్సి వచ్చింది. అలాంటి కష్టాలు నా జర్నీలో చాలా ఉన్నాయి’ అంటూ రవికృష్ణ చెప్పుకొచ్చాడు.