`కేజీఎఫ్’ అధీరాకి డబ్బింగ్ చెబుతున్న రవి శంకర్ !

`కేజీఎఫ్’ అధీరాకి డబ్బింగ్ చెబుతున్న రవి శంకర్ !

Published on Sep 19, 2020 11:26 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించి పాన్ ఇండియా సినిమా అయింది. ఇక ఈ చిత్రంలో ప్రధానమైన ప్రతినాయకుడి పాత్ర అధీరా కోసం బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా పై హైప్ మరింత పెరిగింది. ఇక సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ ను ఇప్పటికే షూట్ చేశారు. ఎడిటింగ్ కూడా పూర్తయిందట.

కాగా తాజాగా సంజయ్ దత్ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు నటుడు రవి శంకర్ డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ దత్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని.. ‘యశ్’ కంటే కూడా సంజయ్ దత్ నే హైలెట్ అవుతాడని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది. యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు