అదిరే లెవెల్లో రవిశంకర్ తనయుడు “సుబ్రహ్మణ్య” ఫస్ట్ లుక్

మన దక్షిణాదిలో ఎన్నో సినిమాలకి తన పవర్ఫుల్ వాయిస్ తో వాయిస్ ఓవర్ ని అందించిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే నటుడు రవి శంకర్ కోసం అందరికీ తెలిసిందే. మరి తాను దర్శకునిగా మారి తన వారసుడు అద్వయ్ ని హీరోగా పరిచయం చేస్తూ రీసెంట్ గా అనౌన్స్ చేసిన భారీ పాన్ ఇండియా చిత్రమే “సుబ్రహ్మణ్య”. మరి అనౌన్సమెంట్ తో మంచి ఆసక్తి రేకెత్తించిన మేకర్స్ నేడు వినాయక చవితి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని శివ రాజ్ కుమార్ రిలీజ్ చేశారు.

మరి ఇందులో అద్వయ్ చూసేందుకు మంచి డాషింగ్ లుక్స్ లో పర్ఫెక్ట్ హీరోగా కనిపిస్తున్నాడు అని చెప్పాలి. అలాగే ఈ చిత్రాన్ని అదిరే యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్టు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. అలాగే అద్వయ్ ఈ ఫస్ట్ లుక్ లో ఓ సూపర్ హీరో తరహాలో కనిపిస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా తిరుమల రెడ్డి, అనిల్ కడియాల నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version