మాస్ మహారాజా రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగిల్. ఈ యాక్షన్ మూవీకి యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా దవ్ జంద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈగిల్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై రవితేజ ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.
విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 20న సాయంత్రం 4 గం. 5 ని. లకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మాస్ మహారాజా మంచి పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానుంది.