తమిళ రీమేక్ లో రవితేజ – ఇలియానా ?

Published on Aug 16, 2020 12:27 am IST

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఎనభై శాతం పైగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని కరోనా అనంతరం విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే రవితేజ మాత్రం ప్రస్తుతం తన తరువాత సినిమా గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో తన తరువాత సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రీమేక్ అని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది.

కాగా తమిళంలో అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ – ఇలియానా చేయబోతున్నారట. ఇప్పటికే ఇలియానా కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. కానీ, ఈ సినిమాకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. మరి ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందా… ఎలాగూ లాస్ట్ సినిమా ‘డిస్కో రాజా’తో రవితేజ నిరాశ పరిచాడు. కనీసం క్రాక్ తోనైనా ఆకట్టుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More