తండ్రీకొడుకులుగా రవితేజ ?

తండ్రీకొడుకులుగా రవితేజ ?

Published on Mar 8, 2021 9:31 AM IST

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే సినిమాని దర్శకుడు రమేష్ వర్మతో చేస్తున్నాడు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రవితేజ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. తండ్రి పాత్ర చనిపోయిన దగ్గర నుండి కథ ఎన్ని మలుపులు తిరిగింది ? చివరకు తండ్రి కథకు కొడుకు పాత్ర ఎలాంటి ముగింపు ఇచ్చాడు అనేది మెయిన్ ప్లాట్ అట. మరి ఈ సినిమాలో రవితేజది డబుల్ రోల్ కాబట్టి ఇద్దరు హీరోయిన్లని తీసుకున్నారు.

ఇక రవితేజ క్రాక్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. కాబట్టి ఇప్పుడు చేస్తోన్న ఖిలాడీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఆ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే రమేష్ వర్మ సినిమాలో ఫుల్లుగా మాస్ అంశాలు నింపే ప్రయత్నం చేసున్నాడు. పైగా ఖిలాడి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అనసూయ కూడా జాయిన్ అయింది ఈ సినిమాలో. అనసూయది కూడా కీలక పాత్ర అట. మరి చూడాలి ఈ సినిమాతో రవితేజకు ఎలాంటి హిట్ వస్తోందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు