కిల్లర్ గా మారబోతున్న రవితేజ ?

కిల్లర్ గా మారబోతున్న రవితేజ ?

Published on May 24, 2020 6:09 PM IST


హీరో రవితేజ గత కొన్ని సినిమాలుగా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయినప్పటికీ సినిమాల స్పీడ్ ను మాత్రం పెంచుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. కాగా రవితేజ్ చేస్తోన్న రెండు పాత్రల్లో ఒక పాత్ర కిల్లర్ అట, అలాగే మరో పాత్ర పోలీస్ పాత్ర అట. పోలీస్ పాత్ర కూల్ గా ఉంటే.. కిల్లర్ పాత్ర పక్కాగా మాస్ పాత్ర అట. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం.

అలాగే మరో హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకోనున్నారు. గతంలో నేల టిక్కెట్టు సినిమాలో మాళవిక రవితేజ సరసన నటించింది. అయితే ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఇంకా రిలీజ్ కానీ ఓ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అన్నట్టు ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు