రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ ట్రైలర్ డేట్, టైం ఫిక్స్

రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ ట్రైలర్ డేట్, టైం ఫిక్స్

Published on Dec 24, 2023 1:11 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన కమెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వెంకీ. స్నేహా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2004లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని లక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ పై అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు.

కోనవెంకట్, గోపిమోహన్ అద్భుతంగా రచించిన ఈ మూవీలోని కామెడీ సీన్స్ ఇప్పటికీ కూడా ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటాయి. విషయం ఏమిటంటే, డిసెంబర్ 30న వెంకీ మూవీని గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కాగా వెంకీ రీ రిలీజ్ ట్రైలర్ ని రేపు ఉదయం 11 గం. లకు రిలీజ్ చేయనున్నట్టు తాజాగా అనౌన్స్ చేసారు. మరి ఇప్పటి ఆడియన్స్ ని ఏస్థాయిలో వెంకీ అలరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు