‘మాస్ జాతర’ చేసేందుకు నార్వేలో రవితేజ బిజీ!

‘మాస్ జాతర’ చేసేందుకు నార్వేలో రవితేజ బిజీ!

Published on Dec 12, 2024 3:00 AM IST

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు భాను భోగవరపు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే, ఇటీవల రవితేజ చేతికి సర్జరీ జరిగింది. దీంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆయన, ఇప్పుడు తిరిగి మాస్ జాతర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. యూరప్‌లోని నార్వే ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. మంచులో ఈ చిత్రానికి సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

ఇక సెట్స్ నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు