మాస్ రాజా ‘ధమాకా’ ఆ తేదీన రిలీజ్ కానుందా …?

Published on Sep 23, 2022 3:04 am IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ధమాకా. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై నిర్మితం అవుతున్న ఈ మూవీ నిన్నటితో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ధమాకా రొమాంటిక్ గ్లింప్స్, జింతాక్ సాంగ్ ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో మంచి హైప్ ఏర్పరిచాయి. ఇక ఈ మూవీ నుండి మాస్ రాజా సాంగ్ రేపు సాయంత్రం రిలీజ్ కానుండగా మూవీని అక్టోబర్ 21 న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు యూనిట్ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ తన మార్క్ మాస్ ఎంటర్టైనింగ్ స్టైల్ లో కనిపించనున్న ధమాకా తప్పకుండా రిలీజ్ తరువాత విజయం సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :