రవితేజ ‘ధమాకా’ షూట్ కంప్లీట్….!

Published on Sep 22, 2022 3:00 am IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థల పై తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ మూవీని పక్కా ఎంటర్టైనర్ గా త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క పోస్టర్స్, జింతాక అనే పల్లవితో సాగె మాస్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఇక ఈ మూవీ నుండి మాస్ రాజా సాంగ్ ని రేపు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. అయితే విషయం ఏమిటంటే, నేటితో ఈ మూవీ యొక్క షూట్ మొత్తం కంప్లీట్ అయిందని, అలానే త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసి మూవీ ని పక్కాగా దీపావళి సమయానికి థియేటర్స్ లోకి తీసుకువస్తాం అని యూనిట్ అంటోంది. మూవీ కోసం యావత్ తమ యూనిట్ మొత్తం ఎంతో కష్టపడ్డారని, అటు హీరో రవితేజ, ఇటు దర్శకుడు త్రినాధరావు, నిర్మాతలు సినిమాని మంచి సక్సెస్ చేసేందుకు శ్రమించారని, తప్పకుండా రిలీజ్ తరువాత ధమాకా అందరి అంచనాలు అందుకుంటుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :