“హను మాన్” సక్సెస్ తో మాస్ మహారాజ ఫ్యాన్స్ హ్యాపీ!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం ఈ సంక్రాంతి పండుగ ను సూపర్ గా క్యాష్ చేసుకుంటుంది. అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం సక్సెస్ పట్ల మాస్ మహారాజ రవితేజ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం లో రవితేజ కోతి పాత్రకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇది ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ లో భాగం కావడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈగిల్ మూవీ సంక్రాంతి బరిలో ఉండగా, వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 9 న థియేటర్ల లోకి రానుంది.

Exit mobile version