మళ్ళీ “విక్రమార్కుడు” రవితేజ మాస్ జాతర

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరోస్ లో మాస్ మహరాజ్ రవితేజ కూడా ఒకరని చెప్పాలి. మరి తను హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే మాస్ జాతర. ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ తో సాలిడ్ హైప్ ని ఈ సినిమా అందుకుంది. మరి ఈ సినిమాలో రవితేజ లుక్ కూడా రివీల్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా ఇంకొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి చూస్తే మళ్లీ వింటేజ్ విక్రమార్కుడు రవితేజ గుర్తు రాక మానడు. ఆ మీసకట్టు హెయిర్ స్టైల్ మళ్లీ పాత రవితేజని గుర్తు చేస్తున్నాయి. దీనితో మాస్ మహరాజ్ ఫ్యాన్స్ కి మాస్ జాతరలో క్రేజీ ట్రీట్ ఉండబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version