‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ షో రీల్.. మాస్ స్వాగ్ తో ర్యాంప్ ఆడేసిన ర‌వితేజ‌

‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ షో రీల్.. మాస్ స్వాగ్ తో ర్యాంప్ ఆడేసిన ర‌వితేజ‌

Published on Jun 17, 2024 4:48 PM IST

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ నుండి తాజాగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ సినిమా నుండి షో రీల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మేక‌ర్స్, దానిని తాజాగా రిలీజ్ చేశారు. నిమిషం పాటు ఉన్న ఈ వీడియో గ్లింప్స్ ను చూసి మాస్ రాజా అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

ర‌వితేజ త‌న‌దైన మాస్ స్వాగ్ తో రెచ్చిపోయాడు. ఈ వీడియో గ్లింప్స్ లో ర‌వితేజ సరికొత్త లుక్ లో క‌నిపించాడు. ఇన్ క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్ గా ఆయ‌న ఈ సినిమాలో చెల‌రేగిపోయి ప‌ర్ఫార్మ్ చేయ‌నున్న‌ట్లు ఈ షోరీల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక విల‌న్ పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు కూడా టెర్రిఫిక్ గా కనిపించారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ షోరీల్ ర‌వితేజ ఫ్యాన్స్ కి పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింది.

ఇక ఈ సినిమాలో భాగ్ర‌శ్రీ బొర్సె హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఆమె కూడా ఈ షోరీల్ గ్లింప్స్ లో క‌నిపించింది. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈసారి అభిమానుల‌కు పూర్తి మాస్ మ‌సాలా ఎంట‌ర్టైన‌ర్ ని అందించ‌బోతున్న‌ట్లు ఈ గ్లింప్స్ వీడియో చూస్తే తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పై టిజి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు