“క్రాక్”స్ట్రీమింగ్ హక్కులు వారు దక్కించుకున్నారా?

Published on Jan 14, 2021 10:17 pm IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “క్రాక్”. సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం ఇప్పుడు భారీ హిట్ దశగా వెళ్తుంది. అంతే కాకుండా రవితేజ కం బ్యాక్ ను అంతా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను ఎవరు కొనుగోలు చేసారు అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు.

అలాగే ఈ చిత్రం స్క్రీనింగ్ సమయంలో కూడా ఎక్కడా కనిపించలేదు. మరి దీనితో ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడుపోలేదా కొంటే ఎవరు కొన్నారు అన్నది ప్రశ్నగా మారింది. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా” వారు కొనుగోలు చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇతర సంస్థలకు అయితే ఈ పాటికే టాక్ వచ్చేసేది మరి బహుశా ఆహా కొనుగోలు చేసింది నిజమే కావచ్చు. మరి దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే కానీ ఏది అన్నది కన్ఫర్మ్ కాదు.

సంబంధిత సమాచారం :

More