“RC 16” కోసం రా అండ్ రస్టిక్ టెక్నీషియన్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కోసం అందరికీ తెలిసిందే. చరణ్ కెరీర్ లో ఇది 16వ సినిమా కాగా దీనిపై కూడా గట్టి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని బుచ్చిబాబు ఒక పక్కా మాస్ అండ్ రూరల్ రస్టిక్ డ్రామాగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి అందుకోసమే ఓ సాలిడ్ టెక్నీషియన్ ని పట్టుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో వేషధారణ కోసం ఇటీవల కోలీవుడ్ చిత్రం “తంగలాన్” కోసం వర్క్ చేసిన ప్రముఖ టెక్నీషియన్ ఏగన్ ఏకాంబరం ఇప్పుడు చరణ్ 16వ సినిమాకి వర్క్ చేయబోతున్నారట. తంగలాన్ లో విక్రమ్ అలాగే మాళవిక మోహనన్ ఇలా రెండు తెగలకు చెందిన వారి డ్రెస్సింగ్ అంతా ఎంత సహజంగా ఉంటుందో చూసాం.

మరి ఇలాంటి టెక్నీషియన్ ని చరణ్ సినిమా కోసం అంటే ఈ సినిమా కూడా ఎలా ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ భారీ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version