సమీక్ష : రాయలసీమ లవ్ స్టోరీ – అంతగా ఆకట్టుకొని లవ్ స్టోరీ

సమీక్ష : రాయలసీమ లవ్ స్టోరీ – అంతగా ఆకట్టుకొని లవ్ స్టోరీ

Published on Sep 28, 2019 2:39 AM IST
Rayalaseema Love Story movie review

విడుదల తేదీ : సెప్టెంబరు 27, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2/5

నటీనటులు : వెంకట్, హ్రిశాలి, పావని, తిల్లు వేణు,నాగినీడు

దర్శకత్వం : రామ్ రణధీర్

నిర్మాత‌లు : రాయల్ చిన్నా మరియు నాగరాజు

సంగీతం : శ్రీ సాయి ఏలేందర్

సినిమాటోగ్రఫర్ : రామ్ మహేందర్

ఎడిట‌ర్‌ : వినోద్ అద్వే

నూతన నటీనటులు వెంకట్ హీరోగా హ్రిశాలి మరియు పావనిలు హీరోయిన్లు గా రామ్ రణధీర్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం “రాయలసీమ లవ్ స్టోరీ”. ఈ రోజే విడుదల కాబడిన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

 

అసలు జీవితంలో ప్రేమ,అమ్మాయిలు అనేవి లేకపోతేనే మగాడు ప్రశాంతంగా ఉంటాడు అనుకుని వాటికి దూరంగా ఉండే యువకుడు కృష్ణ(వెంకట్). అయితే అమ్మాయిని ప్రేమను అంతలా ద్వేషించే కృష్ణ రాధ(హ్రిశాలి) అనే అమ్మాయి ప్రేమలో పడి ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు,కానీ కొన్ని కారణాల ఆ ప్రేమ అర్ధాంతరంగా విఫలం అవుతుంది.అసలు తన ప్రేమ అలా ఎలా విఫలం కావడానికి ఎలాంటి పరిణామాలు దారి తీశాయి.అసలు కృష్ణ అంతలా ప్రేమను,అమ్మాయిలను ద్వేషించడానికి గల కారణం ఏమిటి? ఆఖరుకు కృష్ణ లవ్ స్టోరీ ఏమయ్యింది అన్నవి తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

లవ్ స్టోరీస్ అంటే చాలా మందే కనెక్ట్ అవుతారు.అలాంటి వారికి ఈ సినిమాలో కొన్ని పర్టికులర్ సీన్స్ ఎమోషనల్ గా టచ్ అవుతాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి.అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఒక హాట్ సాంగ్ అయితే బి,సి సెంటర్ ప్రేక్షకులకు నచ్చొచ్చు. ముఖ్యంగా అయితే హీరో ఫ్లాష్ బాక్ ఎపిసోడ్, సెకండాఫ్ లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి.ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టైతే హీరోగా చేసిన వెంకట్ సినిమా మొత్తం మంచి నటన కనబరిచారు.

అలాగే సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే కమెడియన్ వేణు సపోర్టివ్ రోల్ లో కరెక్ట్ గా సెట్టయ్యారు,అలాగే గెటప్ శ్రీను పృద్విరాజ్ లు తమదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు.అలాగే ఈ సినిమా హీరోయిన్స్ అయినటువంటి హ్రిశాలి మరియు పావనిలు మంచి నటన కనబరిచారు.మిగతా నటులు అయినటువంటి నాగినీడు తదితరులు వారి పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేకూర్చారు.కొన్ని సన్నివేశాలు అయితే అసలు బాలేదు అన్న సమయంలో మంచి ట్విస్ట్ తో దర్శకుడు తెరకెక్కించిన తీరు మెచ్చుకోదగినదే అని చెప్పాలి.అలాగే శ్రీ సాయి ఏలేందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.రాయల్ చిన్న మరియు నాగరాజులు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు అందరికి తెలిసినదే అయినా అందరికి బాగా కనెక్ట్ అయ్యే లవ్ స్టొరీ లైన్ ను ఎంచుకున్నారు.కానీ ఎమోషన్స్ ను తాను అనుకున్న కథనాన్ని ఒక రెండున్నర గంటల సినిమాగా మలిచేందుకు చాలా చోట్ల తడబడ్డారు.అసలు హీరోకి ప్రేమ అమ్మాయిలు నచ్చరని ఇంట్రడ్యూస్ చేసిన పాత్ర చాలా సింపుల్ గా వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోయినట్టు అనిపిస్తుంది,అలాగే సెకండాఫ్ లో ఎమోషనల్ గా ఒక ఫ్లో లో సినిమా వెళ్తుంది అన్న సమయంలో అసలు సంబంధం లేని కామెడీ ఇరికించి సినిమాను దర్శకుడు దెబ్బ తీసారు.

ఇలా చాలా సన్నివేశాలే ఈ సినిమాలో ఉన్నాయి.అక్కడక్కడా కామెడీతో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నా చాలా సాగదీతగా అనిపిస్తుంది,అలాగే సెకండాఫ్ లో కూడా స్క్రీన్ ప్లే ఇంకాస్త ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది.ఇంకా కొన్ని కొన్ని సన్నివేశాల్లో అయితే ఎమోషన్స్ అంతగా ఆకట్టుకోవు.దానికి తోడు లవ్ స్టోరీలో పెదవి ముద్దు సన్నివేశాల మోతాదు కాస్త ఎక్కువ అవ్వగా,ఆ సీన్స్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ అంత సహజంగా అనిపించవు.అంతే కాకుండా హీరో క్యారక్టరైజెశషన్ ఇది వరకే చాలా సినిమాల్లో చూసేసినట్టుగా అనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమా కోసం దర్శకుడు రామ్ రణధీర్ డీసెంట్ స్టోరీ లైన్ ను ఎంచుకున్నా దాన్ని కొన్ని అనవసరమైన సన్నివేశాలను ఇరికించి, కొన్ని ఆకట్టుకోని వీక్ ఎమోషన్స్ తో దెబ్బ తీశారు.అలాగే హీరోని హీరో స్థాయిలో కూడా తెరకెక్కించలేదు.ఇలా అనేక అంశాల్లో జాగ్రత్త వహించి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చే అవకాశం ఉండేది.అలాగే రామ్ మహేందర్ అందించిన సినిమాటోగ్రఫీ పరవాలేదు.కానీ సంగీతం అందించిన ఏలేందర్ ప్రతీ సాంగ్ సాంగ్ కు ముందు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

 

ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే రాయలసీమ లవ్ స్టోరీలో లవ్ అయితే ఉంది కానీ స్టోరీ మాత్రం దర్శకుడు తడబాట్లు మూలాన వీకయ్యిపోయింది. కామెడీ మరియు అక్కడక్కడా ఆకట్టుకునే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ప్రేమించిన మనిషి కోసం ఏమయినా చెయ్యొచ్చు ఆఖరికి వారి ప్రేమను కూడా త్యాగం చెయ్యొచ్చు అనే కాన్సెప్ట్ ను ఇంకా బాగా ఎస్టాబిలిష్ చేసి ఉంటే చాలా బాగుండేది.అక్కడక్కడా వీక్ ఎమోషన్స్ లాజిక్ లను పక్కన పెడితే లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి నచ్చొచ్చు.ముఖ్యంగా అబ్బాయిలకు నచ్చే అవకాశం ఉంది.

123telugu.com Rating :  2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు