ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘రజాకార్’

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘రజాకార్’

Published on Jan 7, 2025 10:01 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘రజాకార్’ మూవీ గతేడాది రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణలో రజాకార్ల కాలం నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపెట్టిన ఈ సినిమాను దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేయడంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఈ సినిమా రిలీజై చాలా నెలలు అవుతున్నా, ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్‌కి మాత్రం రాలేదు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. కాగా, ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు ‘రజాకార్’ మూవీ రెడీ అవుతోంది. జనవరి 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘రజాకార్’ మూవీ స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.

దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో బాబీ సింహా, తేజ్ సర్పు, మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జున్, వేదిక, అనసూయ భరద్వాజ్, ఇంద్రజ, ప్రేమ తదితరులు నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు