మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో గ్రాండ్ లెవెల్లో రూపొందనున్న RC 16 మూవీ పై చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకొని ఉంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించనున్న ఈ మూవీకి ప్రముఖ స్వరకర్త ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు.
ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ స్పోర్ట్స్ రూరల్ యాక్షన్ డ్రామా మూవీని మార్చి 20న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇప్పటికే దీనికి సంబందించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. భారీ వ్యయంతో పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.