RC16 ఫస్ట్ లుక్.. ఊహించని లెవెల్లో గ్లోబల్ స్టార్ ఊరమాస్


ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అటు సోషల్ మీడియాలో ఇటు ఆఫ్ లైన్ లో కూడా గ్రాండ్ గా తమ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలా ఇక తన నెక్స్ట్ సినిమా తన కెరీర్ 16వ చిత్రం నుంచి అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోనే గట్టి హైప్ అందుకున్న ఈ చిత్రం నుంచి మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇపుడు వచ్చేసింది.

మరి మేకర్స్ ఒకటి కాదు రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ పోస్టర్స్ లో మాత్రం రామ్ చరణ్ ఊహించని లుక్ లో అదరగొట్టేసాడు అని చెప్పి తీరాలి. ఒక లుక్ లో బీడీ కాలుస్తూ ఇంకో లుక్ లో బ్యాట్ పట్టుకొని ఊరమాస్ లుక్స్ తో చరణ్ దర్శనం ఇవ్వడం అభిమానులని గట్టిగా ఎగ్జైట్ చేస్తుంది. దీనితో ఫస్ట్ లుక్ తోనే మేకర్స్ సిక్సర్ కొట్టారని చెప్పవచ్చు. ఇక ఈ భారీ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version