RC16 టైటిల్ లాక్.. ముహూర్తం ఖరారు చేసారా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని మేకర్స్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ ఏంటి అనేది ఎప్పుడు నుంచో మంచి సస్పెన్స్ గానే ఉంది.

మరి ఈ సినిమా అనుకుంటున్న సమయం నుంచే పెద్ది అనే టైటిల్ వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ టైటిల్ పట్ల ఫ్యాన్స్ లో అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కానీ ఫైనల్ గా మేకర్స్ అదే టైటిల్ ని లాక్ చేసేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ టైటిల్ టీజర్ ని ఈ మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సహకారంతో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version