IPL 2025 : 16 ఏళ్ల తర్వాత చెన్నైపై బెంగళూరు సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరు ఆచితూచి ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లీ(31) పరుగులతో రాణించారు. ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లలో రజత్ పాటిదార్(51) పరుగులతో చెలరేగిపోయాడు. అటుపై టీమ్ డేవిడ్(22 నాటౌట్) చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి బెంగళూరు 196 పరుగులు చేసింది.

ఇక 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మొదట్నుంచి తడబడుతూ ఆడింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర(41) పరుగులతో పోరాడినా, మిగతావారు ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. ఇక చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా(25), ధోనీ(30 నాటౌట్)తో పోరాడినా 8 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో చెన్నై కేవలం 146 పరుగులు మాత్రమే చేయడంతో బెంగళూరు 50 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత చెన్నైపై బెంగళూరు విజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Exit mobile version