ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ(67), దేవ్‌దత్ పడిక్కల్(37), రజత్ పాటిదర్(64), జితేష్ శర్మ(40 నాటౌట్) రాణించడంతో బెంగళూరు 221 పరుగులు చేసింది.
ఇక 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు స్వల్ప పరుగులకే ఔట్ అయ్యారు. వరుస వికెట్లు పడుతున్నా, ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డు మాత్రం ముందుకు వెళ్తూ కనిపించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు తిలక్ వర్మ(56), హార్ధిక్ పాండ్య(42) పరుగులతో రాణించారు. దీంతో 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో ముంబైపై ఆర్సీబీ 12 పరుగుల తేడాతో గెలుపొందింది.