ప్ర‌మోష‌న్స్ అందుకే లేవంటున్న ‘క‌ల్కి’ మేక‌ర్స్..?

ప్ర‌మోష‌న్స్ అందుకే లేవంటున్న ‘క‌ల్కి’ మేక‌ర్స్..?

Published on Jun 18, 2024 11:30 AM IST

పాన్ ఇండియా ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు కొద్దిరోజులే మిగిలి ఉండ‌టంతో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపొంద‌గా, భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో న‌టిస్తున్నారు. సాలిడ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ప్ర‌మోష‌న్స్ అంతంత మాత్ర‌మే జ‌ర‌గ‌డం ఏమిటని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, క‌ల్కి సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మేక‌ర్స్ ఓ స్ట్రాటెజీ ఫాలో అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాకు ఎంత‌ త‌క్కువ ప్ర‌మోష‌న్స్ ఉంటే, సినిమా అంత సాలిడ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ములేపుతుంద‌ని వారు భావిస్తున్నారు. ప్రేక్ష‌కులు ఎలాంటి ఓవ‌ర్ హైప్ లేకుండా ఈ సినిమాకు వ‌స్తే, సినిమా కంటెంట్ వారికి కావాల్సిన ట్రీట్ ఇస్తుంద‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నార‌ట‌. కాగా, ఈ సినిమాకు సంబంధించి నాలుగు ఈవెంట్స్ నిర్వ‌హించాల‌ని.. ఈ ఈవెంట్స్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ‘క‌ల్కి 2898 AD’ మూవీలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్విని ద‌త్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు