అందుకే ఉదయభాను బిగ్ బాస్ 6లో భాగం కాలేదా?

అందుకే ఉదయభాను బిగ్ బాస్ 6లో భాగం కాలేదా?

Published on Sep 6, 2022 11:32 PM IST


బుల్లితెర ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకునే బిగ్ బాస్ రియాలిటీ షో మొదలైంది. బిగ్ బాస్ 6 గత రెండు రోజులుగా రన్ అవుతోంది. ప్రస్తుతం 21 మంది పోటీదారులు ఈ హౌజ్ లో ఉన్నారు. మరియు స్టార్ యాంకర్ ఉదయ భాను షోలో భాగమవుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె లిస్ట్ లో ఎక్కడా కనిపించలేదు. మేకర్స్ కూడా ఆమెకు మంచి రెమ్యునరేషన్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఆమె ఇంకా బిగ్ బాస్ హౌజ్ లో చేరలేదు. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే, ఉదయ భాను తన ఫీజు ను భారీ ధరకి కోట్ చేయడంతో, మేకర్స్ ఆమెను ఎంచుకోలేదు అని తెలుస్తోంది. ఆమె డిమాండ్ చేసిన ఫీజు తో మరో ఇద్దరు యంగ్ బ్యూటీలను తీసుకొచ్చారనేది రూమర్. ఈ వార్త నిజమో కాదో ఉదయభాను మాత్రమే చెప్పాలి. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు