రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి మంచి టాక్ సంతరించుకుని హిట్ అయ్యిన చిత్రాల్లో బయోపిక్ చిత్రం “12త్ ఫెయిల్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం లో ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మాసే హీరోగా నటించగా దర్శకుడు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా లిమిటెడ్ రిలీజ్ అయినప్పటికీ మొదటి రోజు నుంచి కూడాబాలీవుడ్ మార్కెట్ దగ్గర స్టడీ గా వసూళ్లను రాబడుతుంది.
దీనితో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ రేస్ కి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మేకర్స్ తాము పర్సనల్ గా ఆస్కార్ అకాడమీకి సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇది ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అవుతుందో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.


