కేవలం వారంలోపే ఓటిటిలోకి వచ్చేసిన రీసెంట్ మళయాళ థ్రిల్లర్!

కేవలం వారంలోపే ఓటిటిలోకి వచ్చేసిన రీసెంట్ మళయాళ థ్రిల్లర్!

Published on Mar 20, 2025 9:00 AM IST

ఇటీవల మళయాళ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన పలు చిత్రాల్లో కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో దర్శకుడు జీతూ అష్రఫ్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ పోలీస్ డ్రామా ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా ఒకటి. మరి మోలీవుడ్ లో హిట్ అయ్యిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా కేవలం కొన్ని రోజులు కితమే థియేటర్స్ లో రిలీజ్ చేశారు.

తెలుగులో ఈ మార్చ్ 15న రిలీజ్ చేయగా ఇపుడు మార్చ్ 20కి ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో మళయాళం సహా తెలుగు మరియు ఇతర పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి సరిపోదా శనివారం సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా మార్టిన్ పరక్కత్ అలాగే సిబి చరవ, రెనజిత్ నైర్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు