“జల్సా” స్పెషల్ ప్రింట్ కి భారీ సంఖ్యలో షోస్..!

Published on Aug 13, 2022 7:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పలు హిట్ చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన సూపర్ హిట్ సినిమా “జల్సా” కూడా ఒకటి. పవన్ కెరీర్ లో వస్తున్న వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఫ్యాన్స్ కి ఒక బూస్టప్ లా స్టార్ట్ ఇచ్చిన ఈ సినిమాని అభిమానులు ఈ ఏడాది పవన్ బర్త్ డే కానుకగా ప్లాన్ చేసుకున్నారు. మరి పాత ప్రింట్ ని సౌండ్ మరియు విజువల్ క్వాలిటీ అప్డేట్ చేసుకొని మేకర్స్ ప్లాన్ చెయ్యగా నిన్నటి ఔట్ పుట్ తో ఇక కొత్త ప్రింట్ సిద్ధం అయిపోయింది.

దీనితో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే రోజున భారీ స్థాయిలో షోస్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. మరి జల్సా కి ఏకంగా 500 కి పైగా షోస్ ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ టాక్.. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సాలిడ్ ఆల్బమ్ అందించగా గీతా ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :