యూఎస్ లో “పొన్నియిన్ సెల్వన్ 2” రికార్డు నంబర్స్.!

స్టార్ హీరోలు విక్రమ్, కార్తీ, జయం రవి అలాగే స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్ మరియు త్రిష లు కీలక పాత్రల్లో లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “పొన్నియిన్ సెల్వన్”. మరి దర్శకుడు తన డ్రీం ప్రాజెక్ట్ గా రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి భాగం సెన్సేషనల్ హిట్ కాగా పార్ట్ 2 కూడా ఇప్పుడు బిగ్ హిట్ దిశగా వెళ్లేలా అనిపిస్తుంది.

ఇక ఈ అవైటెడ్ సినిమా పార్ట్ 1 తో పోలిస్తే కాస్త తక్కువ ఓపెనింగ్స్ నే నమోదు చేయగా యూఎస్ లో మాత్రం ఈ సినిమా సాలిడ్ నంబర్స్ ని నమోదు చేస్తుంది. ఇక ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేసింది. దీనితో రెండో రోజు పూర్తి కాకుండానే ఈ చిత్రం మార్క్ ని కొట్టేసింది. ఇక ఈ ఆదివారం మూడో రోజు మరింత స్ట్రాంగ్ వసూళ్లు రాబడుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

Exit mobile version