“రెడ్”, “అల్లుడు అదుర్స్” నైజాం డే 1 వసూళ్లు ఇవే.!

“రెడ్”, “అల్లుడు అదుర్స్” నైజాం డే 1 వసూళ్లు ఇవే.!

Published on Jan 15, 2021 2:00 PM IST

ఈ ఏడాది సంక్రాంతి సినిమా పండుగ కూడా మన దగ్గర మంచి రసవత్తరంగా నెలకొంది అని చెప్పాలి. ఈ ఏడాది మాస్ మహారాజ్ రవితేజ “క్రాక్”తో మొదలయ్యిన ఈ రేస్ నిన్న సంక్రాంతికి గాను మరో రెండు నోటెడ్ చిత్రాలు “రెడ్” మరియు “అల్లుడు అదుర్స్” సినిమాలు విడుదల కాబడ్డాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరియు బెల్లం కొండా శ్రీనివాస్ లు నటించిన ఈ చిత్రాలు మంచి విడుదల కాబడ్డాయి.

అయితే మరి ఈ రెండు చిత్రాలు కూడా మంచి ఓపెనింగ్స్ నే అందుకున్నాయి. అయితే నైజాం లోని ఈ రెండు చిత్రాలకు వచ్చిన వసూళ్ల లెక్కలు చూస్తే కిషోర్ తిరుమల తెరకెక్కించిన “రెడ్” చిత్రానికి గాను డే 1 ఒక్క నైజాం లోనే 2.02 కోట్లు షేర్ రాబట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఫిగర్స్ రావడం విశేషమే అని చెప్పాలి.

ఇక సంతోష్ శ్రీనివాస్ చేసిన “అల్లుడు అదుర్స్” సినిమా విషయానికి వస్తే డే 1 నైజాం లో 68 లక్షలు రాబట్టింది. అయితే ఈ చిత్రానికి ఇంత గట్టి పోటీ నడుమ ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్ దక్కిందనే చెప్పాలి. మొత్తానికి ఈ రెండు చిత్రాల తాలూకా నైజాం వసూళ్లు మొదటి రోజు ఇలా వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు