‘దేవర’ ట్రైలర్ OST ‘రెడ్ సీ’.. పూనకాలే!

‘దేవర’ ట్రైలర్ OST ‘రెడ్ సీ’.. పూనకాలే!

Published on Sep 12, 2024 8:01 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ‘దేవర’ మరికొద్ది రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో తారక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. ఇక రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా ఈ మూవీ ట్రైలర్‌కి సంబంధించిన OSTని వారు రిలీజ్ చేశారు. ‘రెడ్ సీ’ అంటూ సాగే ఈ OST పవర్‌ఫుల్ ట్రాక్‌తో ఉండటం విశేషం. ఇక అనిరుధ్ అందించిన మ్యూజిక్‌తో ఈ OST ట్రాక్‌ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో తారక్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు