ఓటీటీ సమీక్ష: రేఖాచిత్రం – సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

ఓటీటీ సమీక్ష: రేఖాచిత్రం – సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

Published on Mar 7, 2025 6:08 PM IST

Rekhachithram Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 07 , 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : ఆసిఫ్ అలీ, మమ్ముట్టి(కల్పితం), అనస్వర రాజన్, మనోజ్ కె జయన్, జరీన్ షిహబ్, సిద్ధిఖీ తదితరులు
దర్శకుడు : జోఫిన్ టి చాకో
నిర్మాత : వేణు కున్నప్పిల్లి
సంగీతం : మూజీబ్ మజీద్
సినిమాటోగ్రఫీ : అప్పు ప్రభాకర్

ఎడిటర్ : షమీర్ ముహమ్మద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మలయాళంలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ‘రేఖాచిత్రం’ బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్ల మేర వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, మనోజ్ కె జయన్‌లు లీడ్ రోల్స్‌లో నటించగా.. AI ద్వారా మమ్ముట్టి కేమియో పాత్రలో కనిపించాడు. పొంగల్ బరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే, ఇటీవల ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ :
కేరళ పోలీస్ ఆఫీసర్ అయిన వివేక్(ఆసిఫ్ అలీ) తన బెట్టింగ్ అలవాటు వల్ల ఉద్యోగం నుంచి సస్పెండ్ అయి ఉంటాడు. అయితే ఓ యువతి హత్య కేసులో అతడిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారు అధికారులు. మమ్ముట్టి నటించిన 1985 ఐకానిక్ చిత్రం ‘కాతోడు కాథోరం’ షూటింగ్‌లో భాగంగా రేఖ(అనస్వర రాజన్) అనే అమ్మాయిని మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి తానే హత్య చేసినట్లుగా రాజేంద్రన్(సిద్ధిఖీ) అనే వృద్ధుడు ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో వెల్లడిస్తాడు. దీంతో ఈ కేసును తిరిగి ఓపెన్ చేస్తారు. మరి వివేక్ 40 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ హత్య కేసును పరిష్కరిస్తాడా లేడా.. అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
ఓ సస్పెండ్ అయిన ఇన్‌స్పెక్టర్ 40 ఏళ్ల క్రితం నాటి మర్డర్ కేసును ఎలా చేధిస్తాడు.. అనేది ఆసక్తికరంగా నిలిచింది. స్లో బర్న్ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే మలయాళ రైటర్స్, దర్శకులు మరోసారి ‘రేఖాచిత్రం’తో ఈ జోనర్‌లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. లీడ్ క్యాస్టింగ్ సాలిడ్ పర్ఫార్మెన్స్‌లు, ఆకట్టుకున్న మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. దర్శకుడు జోఫిన్ టి చాకో ఈ సినిమాలోని ట్విస్టులను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ఆసిఫ్ అలీ ఎప్పటిలాగే తనదైన సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. 40 ఏళ్ల క్రితం నాటి మర్డర్ కేసును చేధించేందుకు ఆయన ఎలాంటి ఎత్తులు వేస్తాడు అనేది ఆసక్తికరంగా చూపెట్టారు. రేఖ పాత్రలో అనస్వర రాజన్ ఈ సినిమా కథకు మరింత డెప్త్ తీసుకొచ్చింది.

మలయాళం సినిమాలోని అద్ధుతమైన కాలాన్ని అనస్వర పాత్ర ద్వారా చూపెట్టే ప్రయత్నం దర్శకుడు చేశాడు. తమ అభిమాన హీరోను దేవుడిలా పూజించే అభిమానులు మనకు ఈ సినిమాలో కనిపిస్తారు. ‘కాతోడు కాథోరం’ చిత్ర షూటింగ్ సమయంలో మమ్ముట్టి పాత్రను AI ద్వారా చూపెట్టిన అంశం ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో పాజిటివ్ అంశాలు చాలా ఉన్నప్పటికీ.. కొన్ని నెగెటివ్ అంశాలు కూడా ఉన్నాయి. మిగతా మలయాళ థ్రిల్లర్ చిత్రాల మాదిరిగానే, రేఖాచిత్రం కూడా పేస్ విషయంలో ట్రాక్ తప్పింది. చాలా సీన్స్ స్లో గా సాగినట్లుగా కనిపిస్తాయి. ఫాస్ట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమాలోని సీన్స్ కొంతమేర నచ్చకపోవచ్చు. స్లో పేస్ కారణంగా ఈ సినిమా కథనం కొంతమేర చిరాకు తెప్పిస్తుంది.

సాంకేతిక వర్గం:
రేఖాచిత్రం స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా కనిపిస్తుంది. జాన్ మంత్రికల్, రాము సునీల్ తమ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేశారు. రాము సునీల్ అందించిన సాలిడ్ కథనంతో పాటు ఈ సినిమాకు టెక్నికల్ అంశాలు అత్యద్భుతంగా కలిసొచ్చాయి.

అప్పు ప్రభాకర్ తన సినిమాటోగ్రఫీతో అందించిన విజువల్స్ ఆకట్టుకుంటాయి. షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ వర్క్ కూడా సినిమాలోని డ్రామాను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ముజీబ్ మజీద్ సంగీతం సినిమాలోని మిస్టరీ అంశాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది.

తీర్పు:
ఓవరాల్‌గా ‘రేఖాచిత్రం’ తనదైన స్టోరీటెల్లింగ్‌తో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 80ల నాటి సినిమా షూటింగ్ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపెట్టారు. ఓ మర్డర్ కేసును ఇలా కూడా చేధిస్తారా అనే అంశం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. దీనికి తోడు సాలిడ్ పర్ఫార్మెన్స్‌లు, టెక్నికల్ టీమ్ బ్రిలియన్స్ పనితనం కలగలిసి ఈ సినిమాను ఆకట్టుకునే మూవీగా నిలిపాయి. అయితే, స్లో పేస్ కారణంగా కొన్ని ఆసక్తికరమైన సీన్స్ కూడా రొటీన్‌గా అనిపిస్తాయి. మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారు ‘రేఖాచిత్రం’ మూవీని ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు