“హను మాన్” మేనియా ఇక జపాన్లోకి.. రిలీజ్ డేట్ ఖరారు

“హను మాన్” మేనియా ఇక జపాన్లోకి.. రిలీజ్ డేట్ ఖరారు

Published on Jul 27, 2024 3:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఇటీజ్ సజ్జ హీరోగా యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “హను మాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా ఇది కాగా చిన్న చినుకులా వచ్చి బాక్సాఫీస్ దగ్గర ప్రళయ తుఫాన్ లాంటి సక్సెస్ ని ఈ చిత్రం చూసింది. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ అప్పుడే పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జపాన్ వెర్షన్ రిలీజ్ కూడా ఒకటి.

అయితే ఇప్పుడు ఫైనల్ గా జపాన్ వెర్షన్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో హను మాన్ జపాన్ వెర్షన్ ట్రైలర్ వైరల్ అవుతుండగా దీనితో ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా రివీల్ చేశారు. మరి అక్కడ ఈ చిత్రం తెలుగు భాషలో జపాన్ సబ్ టైటిల్స్ తో విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సెన్సేషనల్ సక్సెస్ చిత్రం అక్కడ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు