బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ఒక వైలెంట్ హిట్ “అనిమల్” తర్వాత చేస్తున్న పీరియాడిక్ భారీ సినిమానే “రామాయణం”. దర్శకుడు నితీష్ తివారి కలయికలో స్టార్ట్ అయ్యిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో రామునిగా రణబీర్ నటిస్తుండగా హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. మరి మొదటి నుంచీ మంచి ఎగ్జైట్మెంట్ ఉన్న ఈ సినిమా రిలీజ్ పై ఫైనల్ గా బాలీవుడ్ నుంచి క్లారిటీ వచ్చేసింది.
మరి ఈ సినిమాని రెండు భాగాలుగా చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. మొదటి భాగాన్ని ఏకంగా 2026 దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే రెండో భాగాన్ని ఆ మలి ఏడాది 2027 దీపావళి కానుకగా అయితే విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో రానున్న వరుస రెండేళ్లు దీపావళి రేస్ ని బాలీవుడ్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ చేసుకుంది అని చెప్పాలి. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.