Devara: ఫ్యాన్స్‌కు ’దేవర‘ ట్రీట్.. రిలీజ్ ట్రైలర్‌కి టైమ్ ఫిక్స్

Devara: ఫ్యాన్స్‌కు ’దేవర‘ ట్రీట్.. రిలీజ్ ట్రైలర్‌కి టైమ్ ఫిక్స్

Published on Sep 21, 2024 11:07 PM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఒకటే మాట.. ‘దేవర’. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ భారీ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

అయితే, ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా, ఇప్పుడు అభిమానులకు దేవర మరో సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 22న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

దీంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాకు ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మిడ్‌నైట్ షోలకు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వడంతో ఈ సినిమా మేనియాతో అభిమానులు ఊగిపోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు