“భారీ తారాగణం” నుండి రెండే రెండు అక్షరాల ప్రేమ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌!

“భారీ తారాగణం” నుండి రెండే రెండు అక్షరాల ప్రేమ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌!

Published on Jun 4, 2023 8:36 AM IST


సదన్‌, దీపికా రెడ్డి, రేఖ నిరోషి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం భారీ తారాగణం. శేఖర్‌ ముత్యాల దర్శకత్వంలో బివిఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. సుక్కు సంగీతం అందించిన ఈ చిత్రంలోని రెండే రెండు అక్షరాల ప్రేమ అంటూ సాగే పాటను విడుదల చేయడం జరిగింది. సంగీత దర్శకుడు సుక్కూ రచించిన ఈ పాటను జయశ్రీ పాల్యం ఆలపించారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, “లవ్‌, కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, అలీ యాక్ట్‌ చేసిన దాబా సాంగ్‌కు చక్కని స్పందన లభించింది. ఇందులోని రెండే రెండు అక్షరాల ప్రేమ పాట అంతకుమించి అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఇటీవల కొందరు డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించాం. వారంతా సినిమా చూసి మెచ్చుకున్నారు. ఆ దైర్యంతో త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది” అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా ఎం.వి గోపి, ఎడిటర్‌ మార్తండ్‌ కె. వెంకటేశ్‌, సంగీతం సుక్కు, నేపథ్య సంగీతం సాహిత్య సాగర్‌, కో ప్రొడ్యూసర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌.వి, కొరియోగ్రాఫర్‌ శ్రీవీర్‌ దేవులపల్లి, పాటలు సుక్కూ, సాహిత్య, కమల్‌ విహాస్‌, శేఖర్‌, పిఆర్వో మధు వి.ఆర్‌, ఆర్ట్‌ జెకె మూర్తి, స్టంట్స్‌ దేవరాజ్‌, బ్యానర్‌ బివిఆర్‌ పిక్చర్స్‌, నిర్మాత బి.వి.రెడ్డి, దర్శకత్వం శేఖర్‌ ముత్యాల లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు